Share News

Kumaram Bheem Asifabad: సర్దార్‌ వల్లాభాయ్‌పటేల్‌ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:14 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): భారత దేశ ప్రథమ హోంశాఖ మంత్రి, ప్రథమ ఉపప్రధాని సర్దార్‌ వల్లబాయిపటేల్‌ దేశానికిచేసిన సేవలు చిరస్మ రణీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కొనియాడారు.

 Kumaram Bheem Asifabad:  సర్దార్‌ వల్లాభాయ్‌పటేల్‌ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

ఆసిఫాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): భారత దేశ ప్రథమ హోంశాఖ మంత్రి, ప్రథమ ఉపప్రధాని సర్దార్‌ వల్లబాయిపటేల్‌ దేశానికిచేసిన సేవలు చిరస్మ రణీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కొనియాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌జయంతిని పురస్కరించుకొని గురువారంజిల్లా కేంద్రంలోని పోలీసుకార్యాలయంలో వల్లబాయిపటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశ భద్రత కోసం ఐక్యత కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. అనంతరం పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, సీఐ బుద్దే రవీందర్‌, పెద్దన్న, పోలీసులు అధికారులు అంజన్న, లవన్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 30పోలీసు యాక్టు అమలు..

శాంతిభద్రతల దృష్ట్యాజిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావ రణాన్ని మరింత సవ్యంగా కొనసాగించడానికి అక్టోబరు 31నుంచి ఈనెల30వరకు జిల్లాఅంతటా 30పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాపోలీసు కార్యాలయంలో ఆయనమాట్లాడుతూ ముం దస్తు అనుమతులులేకుండా ఎలాంటి ప్రజాసమావేశాలు, ఊరేగింపులు,ధర్నా, బహిరంగసభలు తదితరప్రజలు గుమి కూడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదన్నారు. ప్రజాజీవనానికి ఇబ్బంది, చిరాకు కలిగించే లౌడ్‌స్పీకర్లు, డీజేలు వంటివి నిషేదమని తెలిపారు.

Updated Date - Nov 01 , 2024 | 11:14 PM