Kumaram Bheem Asifabad: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:23 PM
రెబ్బెన, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వపాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెనలోని జడ్పీ ఉన్నతపాఠశాలను సందర్శించారు.
-కలెక్టర్ వెంకటేష్ దోత్రే
రెబ్బెన, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వపాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెనలోని జడ్పీ ఉన్నతపాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, నిత్యావసర సరుకులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు తాజాభోజనం, మెనూప్రకారం అందించాలన్నారు. ఆహారం తయారీలో నాణ్యమైన భోజ నం కల్పించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని తప్పులు లేకుండా పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.
సన్నరకం ధాన్యాన్ని తీసుకరావాలి
రైతులు కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యాన్ని తీసుకవచ్చి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండ లం నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సన్నరకం ధాన్యానికి మద్దతుధరతోపాటుక్వింటాలుకు రూ.500 బోన స్ అందిస్తున్నట్టు తెలిపారు. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు.