Share News

Kumaram Bheem Asifabad: విద్యార్థినుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:07 PM

వాంకిడి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గిరిజనఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకో వాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు నీలాదేవి పేర్కొన్నారు.

Kumaram Bheem Asifabad:  విద్యార్థినుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

- మహిళా కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు

వాంకిడి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గిరిజనఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకో వాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు నీలాదేవి పేర్కొన్నారు. బుధవారం వారు గిరిజన ఆశ్రమపాఠశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆరోగ్యపరిస్థితులను అడిగి తెలుకుసున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజన, మంచినీటి వసతులపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న వంటకాలను పరిశీలించారు. వంటశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వంటసామాగ్రిని శుభ్రంగా కడిగి వంటకాలు చేయాలన్నారు. విద్యార్థినులకు ఎప్పటికప్పుడు వైద్యపరీ క్షలు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైన విద్యార్థినులకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్యంపై వాకబు చేశారు. విద్యార్థి నులకు మెరుగైనవైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. పాఠశాలలో ఉన్న సమ స్యలను ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర కమిషన్‌ సభ్యులు..

ఆసిఫాబాద్‌రూరల్‌: వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమబాలికల పాఠశాలలో ఆస్వస్థతకు గురై జిల్లాకేంద్రంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న విద్యార్థినులు త్రిష, సాయికీర్తనను రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరి బాయి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు నీలదేవి బుధ వారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆరో గ్యపరిస్థితిని వైద్యుడు ప్రసాద్‌ ను అడిగితెలుసుకొని మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. ఆశ్రమపాఠశాలలో సంఘట నపై విచారణ జరిపించి సరైన న్యాయం అందేలా చూస్తామని తెలి పారు.

కోలుకుంటున్న విద్యార్థినులు..

వాంకిడి: ఆశ్రమ పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థినులు కోలుకుంటున్నారు. మంచిర్యాల, కాగజ్‌ నగర్‌, ఆసిఫాబాద్‌, వాంకిడి ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన విద్యార్థినులు కోలుకోవడంతో వారిని డిశ్చార్జీ చేసి పాఠశాలకు తరలించారు. ఆశ్రమపాఠశాలలో ఎప్ప టికప్పుడు వైద్యపరీక్షలుచేస్తూ వైద్యం అందిస్తున్నట్లు హెచ్‌ఎం శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురువిద్యార్థినుల్లో ఇద్దరి ఆరో గ్యం నిలకడగా ఉండగా శైలజ అనే విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితేశైలజకు నిమ్స్‌వైద్యులు మెరుగైనవైద్యం అందిస్తు న్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీసీడీవో శకుంతల తెలిపారు. పాఠశాలలోవిద్యార్థినుల అనారోగ్యా నికి కారణాలు ఇంకాతెలియరాలేదు. విద్యార్థినులు గత 30వతేదీనవాంతులు, విరేచనాలతోఅస్వస్థతకు గురికావ డంతో వంటకుసంబంధించిన సరుకులు,నీటి శాంపుల్స్‌ను పరీక్షలకు పంపించారు.

Updated Date - Nov 06 , 2024 | 11:07 PM