Kumaram Bheem Asifabad: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సర్వేను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 09 , 2024 | 10:42 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 9: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సర్వేను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్‌తివారి అన్నారు.
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్, అక్టోబరు 9: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సర్వేను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్‌తివారి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్-2020 పథకం లో అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్దీకరణకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 7698 దరఖాస్తులు అందాయని ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతిగౌడ్, కమీషన్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.