Kumaram Bheem Asifabad: కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా కల్పించాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 10:20 PM
ఆసిఫాబాద్, నవంబరు 21: కౌలురైతులను గుర్తించి వారికి రైతు భరోసా నిధులు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తా వించాలని రైతుస్వరాజ్యం వేదిక ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేకు వినతిప్రతాన్ని అంద జేశారు.
ఆసిఫాబాద్, నవంబరు 21: కౌలురైతులను గుర్తించి వారికి రైతు భరోసా నిధులు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తా వించాలని రైతుస్వరాజ్యం వేదిక ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేకు వినతిప్రతాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్య క్షుడు బొర్రన్న మాట్లా డుతూ ఉమ్మడి ఆదిలా బాద్‌జిల్లాలో 1.17లక్షల మంది కౌలురైతులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కౌలురైతులకు రైతుభరోసా ఇస్తా మని హామీ ఇచ్చిన్నప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. దీంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కౌలు రైతుల సమస్యలను శీతాకాలఅసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు మాణిక్‌రావు, దుందెరావు, యశ్వంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.