Share News

Kumaram Bheem Asifabad: జాతీయ సాధన సర్వేలో జిల్లాను అగ్రభాగాన నిలపాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జాతీయ సాధనసర్వేలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని జిల్లా అకడమిక్‌మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:   జాతీయ సాధన సర్వేలో జిల్లాను అగ్రభాగాన నిలపాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జాతీయ సాధనసర్వేలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని జిల్లా అకడమిక్‌మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం గుండి జిల్లాపరిషత్‌ సెకండరీపాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా మాట్లా డుతూ డిసెంబరు 4న జాతీయసాధన సర్వే3,6,9వ తర గతులకు ఉంటుందన్నారు.

దానిలో భాగంగా విద్యార్థు లకు ప్రత్యేకతరగతులు నిర్వహిస్తూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అభ్యసన ప్రదీపికలను సమర్థవంతంగా వినియోగించుకొని అన్ని అభ్యసన సామర్థ్యాలు, ఓఎంఆర్‌ పత్రాలమీద విద్యార్థు లకు పూర్తిఅవగాహనను పెంపొందించాలన్నారు. అలాగే పదవతరగతి ఇద్యార్థులకు సెలబస్‌ సకాలంలో పూర్తిచేయాలని, మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలన్నారు. ఆయనవెంట ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యా యులు ఉన్నారు.

పాఠశాలను సందర్శించిన ఎంఈవో..

కౌటాల: మండలంలోని మొగడ్‌దగడ్‌ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈవో హనుమంతు సంద ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో 91మంది విద్యార్థులకు 88మంది విద్యార్థులు హాజరుకావడంతో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయు లను అభినందించారు. మెనూప్రకారం భోజనం అందిం చాలన్నారు. అనంతరం ఆశ్రమఉన్నత పాఠశాలలో 9వతరగతి విద్యార్థుల ఎన్‌ఏఎస్‌ (జాతీయ సాధన సర్వే) సామర్థ్యాలను పరిశీలించారు. అలాగే నజరత్‌ మిషన్‌, భారతి విద్యామందిర్‌ పాఠశాలలను సందర్శించారు. ఎన్‌ఏఎస్‌పై విద్యార్థులను సన్నద్ధం చేయాలని అన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 10:23 PM