Share News

Kumaram Bheem Asifabad: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి : కలెక్టర్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:08 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి : కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్‌హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్న కలెక్టర్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. అంతకుముందు ఎస్పీ,కలెక్టర్‌ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం పోలీసుఅమరవీరుల కుటుంబాలను పలుకరించి వారితో మట్లాడారు. అనం తరం పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలభద్రత కోసం పోలీసులు పాటుపడడం వల్లనే ఈరోజు మనం ప్రశాం తమైన జీవితం గడుపుతున్నామన్నారు. విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం, ఉద్యోగనిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ రుణపడి ఉన్నామన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విధినిర్వహణలో భాగంగా అమరులైన ఎందరో పోలీసు కుటుం బాల త్యాగాలఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈశాంతియుత సమాజమని అన్నారు. అమరు లైన పోలీసు కుటుంబాలకు ఎళ్లవేళలా పోలీసుశాఖ సహాయసహకారాలు ఉంటాయన్నారు. వారు ఎప్ప టికీ పోలీసుకుటుంబంలో సభ్యులే అని తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను నిర్వ హించే క్రమంలో ప్రాణాలను అర్పించి అమరులను గౌరవంగా స్మరించేందుకు ఈరోజు అంకితం అన్నారు. ప్రజల భద్రతకోసం, శాంతికోసం తమప్రాణాలను అర్పించిన ఘనత పోలీసులదేనని అన్నారు. 1959లో లడఖ్‌లో చైనా దళాలతో జరిగిన ఓ మానవతా విరోధదాడిలో పదిమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నా రు. అదే సంఘటనను గుర్తిస్తూ అక్టోబరు 21న పోలీసు అమర వీరుల సంస్మరణదినోత్సవాన్ని ప్రతిసంవత్సరం నిర్వహించుకుంటా మన్నారు. ఆసంఘటన నుంచి ఇప్పటివరకు వేలాదిమంది పోలీసులు దేశంకోసం ప్రాణత్యాగం చేశారన్నారు. మీత్యాగం చిరస్మరణీయం, అమరులైన పోలీసుసిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు మా వందనం, ధన్యవాదాలు అని అన్నారు. అనంతరం శోక్‌శ్రస్త్‌ పరేడ్‌ నిర్వహించి చనిపోయిన పోలీసు అధికారులకు రెండునిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:08 PM