Share News

Kumaram Bheem Asifabad: డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:08 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్‌ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తనిఖీచేశారు.

Kumaram Bheem Asifabad:  డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆసిఫాబాద్‌ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తనిఖీచేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై, గ్రేవ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును ఎస్పీ డీఎస్పీ కరుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్‌కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. నేరాల కట్టడి కోసం అఽధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ బొకెను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్‌, సీఐలు రవీందర్‌, బుద్ధే స్వామి, సత్యనారాయణ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:08 PM