Share News

Kumaram Bheem Asifabad: శిక్షణలో నేర్చుకున్న అంశాలను వృత్తిలో అమలు పర్చాలి: ఎస్పీ

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:48 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చు కున్న అంశాలను వృత్తిలో అమలు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.

Kumaram Bheem Asifabad: శిక్షణలో నేర్చుకున్న అంశాలను వృత్తిలో అమలు పర్చాలి: ఎస్పీ

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చు కున్న అంశాలను వృత్తిలో అమలు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా లో నూతనంగా భర్తీ అయిన పోలీసు సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్ట ర్స్‌లో 15రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్స వంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలు, వెహికల్‌ తనిఖీల్లో తీసుకోవాల్సిన మెలకువలు నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చెక్‌ పోస్టుల వద్ద డ్యూటీలు, వాహనాల తనిఖీలు, ఇతర విధుల నిర్వహణకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే పోలీసుసిబ్బందికి శారీరక దారుడ్యం కోసం, మావోయిస్టు కదిలికలపై ప్రత్యేక నిఘాకోసం ఈశిక్షణ ఎంతో ఉపయోగుడుతుం దన్నారు. ఈశిక్షణను మరింత ఉల్లాసంగా పూర్తి చేయాల న్నారు. కార్యక్రమంలో ఆర్‌డీ ఆడిమన్‌ పెద్దన్న, ఆర్‌ఐ ఎంటీవో అంజన్న, ఆర్‌ఎస్సైలు కిరణ్‌, సందీప్‌, రాజేష్‌, లవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:48 PM