Share News

Kumaram Bheem Asifabad: జీపీ కార్మికుల టోకెన్‌ సమ్మె

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:38 PM

కెరమెరి/తిర్యాణి/కౌటాల/బెజ్జూరు/రెబ్బెన, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లిం చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల టోకెన్‌ సమ్మెలో భాగంగా శుక్రవారం కెరమెరి, తిర్యాణి, కౌటాల, బెజ్జూరు, రెబ్బెన మండలాల గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు.

Kumaram Bheem Asifabad:   జీపీ కార్మికుల టోకెన్‌ సమ్మె

కెరమెరి/తిర్యాణి/కౌటాల/బెజ్జూరు/రెబ్బెన, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లిం చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల టోకెన్‌ సమ్మెలో భాగంగా శుక్రవారం కెరమెరి, తిర్యాణి, కౌటాల, బెజ్జూరు, రెబ్బెన మండలాల గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలి కంగా పనిచేస్తున్న కారోబార్‌లకు సహాయకార్య దర్శులుగా పదోన్నతులు కల్పించాలని, జీవో నెం.51ని రద్దుచేసి జీవోనెం.50 ప్రకారం వేత నాలు చెల్లించాలని కోరారు. కనీసవేతనం రూ.19 వేలు ఇవ్వాలని కోరారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతిపట్ల మౌనం పాటించారు. రెబ్బెనలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోగే ఉపేందర్‌ పంచాయతీ కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 10:39 PM