Share News

Kumaram Bheem Asifabad: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులు

ABN , Publish Date - Dec 27 , 2024 | 10:37 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి శుక్రవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

 Kumaram Bheem Asifabad:  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి శుక్రవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రఫీక్‌, అసద్‌, గుండాశ్యాం, ఆసీఫ్‌, మల్లన్న, దత్తు, శ్రీనివాస్‌, వినోద్‌, కలీం తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో విశ్రాంతఉద్యగులు కరుణాగౌడ్‌, రమేష్‌, సిరాజ్‌, వినోద్‌, వెంకటేష్‌, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి: మాజీప్రధాని మన్మో హన్‌సింగ్‌ మృతితీరని లోటని బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌ కార్‌ అశోక్‌, కాంగ్రేస్‌పార్టీ ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జైతావన్‌ బుద్ధ విహార్‌లో బీఎస్‌ఐ నాయకులు, కాంగ్రెస్‌పార్టీ కార్యా లయంలో ఆపార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి వేర్వేరుగా నివాళులర్పించారు. ఆయాకార్యక్ర మాల్లో అంబేడ్కర్‌ సంఘం నాయ కులు విలాస్‌, దుర్గం శ్యాంరావు, హంసరాజ్‌, రోషన్‌, ప్రతాప్‌, రమేస్‌, కిరణ్‌, జైపాల్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తన నివాసంలో మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ దండెవిఠల్‌ ఆయన నివాసంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే విశ్రాంత ఉద్యోగులసంఘభవనంలో విశ్రాంత ఉద్యోగులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరుణ్‌లోయ, శ్రీనివాస్‌, బాల్కశ్యాం, మురళీధర్‌ రావు, శంకర్‌, సత్యనారాయణ, శివ, నారాయణ, సంతోష్‌, గణ పతి, సదానందం, తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువలేనివని మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు లావుడ్య రమేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దుర్గం దేవాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాజీ ప్రధానిమృతికి సంతాపకంగా నివాళులర్పించారు.

బెజ్జూరు: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో నాయకులు రమేష్‌, లింగయ్య, సురేష్‌గౌడ్‌, సత్యనారాయణ, జలపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 10:37 PM