Kumaram Bheem Asifabad: అంటరానితనాన్ని రూపుమాపాలి: బీఎస్‌ఐ
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:28 PM
వాంకిడి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అంటరానితనాన్ని రూపుమాపాలని బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌మహోల్‌కార్ పేర్కొ న్నారు.
వాంకిడి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అంటరానితనాన్ని రూపుమాపాలని బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌మహోల్‌కార్ పేర్కొ న్నారు. సోమవారం మండలకేంద్రంలోని జేతా వన్ బుద్ధవిహార్‌లో మనుస్మృతి దహనదివస్ సందర్భంగా మనస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరే కిస్తూ అంబేద్కర్ అతని అనుచరులు కలిసి మనుస్మృతిని దహనం చేశారన్నారు. కార్యక్ర మంలో బీఎస్‌ఐ నాయకులు జైరాం ఉప్రె, విజయ్, విలాస్, హిరిషన్, ప్రతాప్, వివిధ గ్రామాలకుచెందిన అంబేద్కర్‌సంఘం నాయకులు పాల్గొన్నారు.
కౌటాల: మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో బుధవారం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రాణహిత నది అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్మృతి ప్రతులను దహనం చేశారు. కౌటాలమండలకేంద్రంలోని బుద్దవిహార్ నుంచి తుమ్మిడిహెట్టి వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విశ్వనాథ్, బండురావు, దిలీప్, ప్రకాష్, అశోక్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.