Kumaram Bheem Asifabad: జీవో60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:23 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణ నిరుపేద నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆర్‌పీలకు జీవో60 ప్రకారం వేత నాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణ నిరుపేద నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆర్‌పీలకు జీవో60 ప్రకారం వేత నాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లాకార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకా లను ప్రజలకు చేర్చడంలో ఆర్‌పీలు ఎంతో కీలకంగా వ్యవహరి స్తున్నారన్నారు. వారికి ఉద్యోగభద్రత కల్పించాలని, పదిలక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్పీల యూనియన్ అధ్యక్షురాలు సునీత, నాయకులు స్వర్ణలత, మాధురి, రమ్యశ్రీ, శైలజ, రమ, తదితరులు పాల్గొన్నారు.