Kumaram Bheem Asifabad: పదేళ్లలో సాధించని అభివృద్ధి పది నెలల్లో సాధించాం
ABN , Publish Date - Dec 05 , 2024 | 11:06 PM
కౌటాల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో సాధించని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పదినెలల్లోనే సాధించిందని రాష్ట్ర ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ టి బెల్లయ్యనాయక్ అన్నారు.
- రాష్ట్ర ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్
కౌటాల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో సాధించని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పదినెలల్లోనే సాధించిందని రాష్ట్ర ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ టి బెల్లయ్యనాయక్ అన్నారు. గురువారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మండలంలోని జగదాంబ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేయకుండా ప్రజాపాలన సాగిస్తున్నారన్నారు. సమగ్ర సర్వేతో రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుస్తాయని దీని ద్వారా ప్రజలకు ఏ రీతిలో మేలు చేయగలమని సీఎం సహామంత్రులు ఆలోచన చేస్తున్నారన్నారు. అనంతరం ఆయనకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ లెక్చరర్‌లు తమను రెగ్యులర్ చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, అజ్మీరా శ్యాంనాయక్, నాయకులు గణపతి, పీసీసీ అర్షద్‌హుస్సేన్, విశ్వనాథ్, నానయ్య తదితరులు పాల్గొన్నారు.