Share News

Kumaram Bheem Asifabad: విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఐటీడీఏ పీవో

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:09 PM

వాంకిడి, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): ఆశ్రమపాఠశాలలో వాం తులు, విచేరనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా పేర్కొన్నారు.

Kumaram Bheem Asifabad:  విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఐటీడీఏ పీవో

- ఎవరూ ఆందోళన పడవద్దు

- ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

వాంకిడి, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): ఆశ్రమపాఠశాలలో వాం తులు, విచేరనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా పేర్కొన్నారు. శనివారం ఆశ్రమపాఠశాలను ఆమె సందర్శిం చారు. అస్వస్థతకు గురవుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులు అందిస్తున్న ఆహారం, మంచినీరు తదితర అంశాలపై పాఠశాల హెచ్‌ ఎం శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకు న్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి నులు అందిస్తున్న వైద్యచికిత్సపై ఆర్‌బీఎస్‌కే వైద్యసిబ్బందిని అడిగితెలుసుకున్నారు. అనం తరం విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడారు. విద్యా ర్థినులకు సకాలంలో వైద్యం అందించి ఆరోగ్యం మెరుగుపడేలా చర్యలు తీసు కుంటున్నామని ఆందోళన పడొద్దని పేర్కొన్నారు. ముగ్గురు విద్యార్థినులకు ఇన్‌ఫెక్షన్‌ పెరగడంవల్ల ఒకరిని కాగజ్‌నగర్‌కు, మరొకరిని ఆసిఫాబాద్‌ వైద్యశాలకు చికిత్సనిమిత్తం తరలిం చామన్నారు. మంచిర్యాలలో చికిత్స పొందుతున్న శైలజఅనే విద్యార్థినికి మెరుగైనవైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వైద్యం అంది స్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఎవరూ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లవద్దని కోరారు. పాఠశాలలో విద్యార్థినులకు వాంతులు, విరేచ నాలు అవుతున్నాయన్న విషయం పై విచారణ జరుపుతున్నామని ఆమె పేర్కొ న్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పీవో వెంట జీసీడీవో శకుంతల, తహసీల్దార్‌ రియాజ్‌ అలీ ఉన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:10 PM