Kumaram Bheem Asifabad: ఘనంగా వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:19 PM
కాగజ్‌నగర్/రెబ్బెన, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్,రెబ్బెన మండలకేంద్రాల్లో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీ నిర్వహించారు.
కాగజ్‌నగర్/రెబ్బెన, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్,రెబ్బెన మండలకేంద్రాల్లో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించాలన్నారు. కార్యక్రమాల్లో కాగజ్‌నగర్ డిప్యూటీ రేంజర్ శశిధర్‌బాబు, రెబ్బెన ఎఫ్‌ఆర్వో నిజాముద్దీన్, బానేష్,ఎఫ్‌ఎస్‌వో బాబు, బీట్ అధికారులు పాల్గొన్నారు.
బెజ్జూరు: వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని బెజ్జూరు అటవీరేంజ్ అధికారి ముసావీర్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణదినోత్సవం సందర్భంగా బుధ వారం మండలకేంద్రంలో విద్యార్థులతో కలిసిర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అటవీఅధికారులు శ్రావణ్, మల్లికార్జున్, మురళీ, వెంకటేష్ పాల్గొన్నారు.
సిర్పూర్(టి): మండలకేంద్రంలో బుధవారం రేంజ్ అధికారి ఎక్బాల్‌హుస్సేన్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
తిర్యాణి: మండలకేంద్రంలో అటవీ అధికారులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేంజ్‌అధికారి సరోజరాణి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ఎక్బాల్, సెక్షన్ ఆఫీసర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి: మండలకేంద్రంలో అటవీ అధికారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి మజారోద్దీన్, తదితరులు పాల్గొ న్నారు.