Share News

Kumaram Bhim Asifabad: సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:44 PM

కాగజ్‌నగర్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏడాది కాంగ్రెస్‌ పాలనలో సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మె ల్యే హరీష్‌బాబు అన్నారు.

Kumaram Bhim Asifabad:  సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

-ఎమ్మెల్యే హరీష్‌ బాబు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏడాది కాంగ్రెస్‌ పాలనలో సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మె ల్యే హరీష్‌బాబు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చ ఎక్కడ పెట్టినా కూడా తాను వస్తానని, తేదీ, సమయం, నిర్ణయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సిర్పూరు నియోజకవర్గ అభివృద్దికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కేంద్రనిధుల ద్వారానే జరుగుతోందన్నారు. వాంకిడి హాస్టల్‌లో విద్యార్థిని చనిపోయితే తాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క రాజీనామా చేయాలని పేర్కొనటం సరైనదేనన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తనపై అవాకులు, చెవాకులు పేలటం మాని ప్రజల సంక్షేమ, అభివృద్ధిపై దృష్టిసారించాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధానకార్యదర్శి దోనిశ్రీశైలం, మాజీఎంపీపీ కొప్పుల శంకర్‌, దూగుంట రాజన్న, దుర్గంకారు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 10:44 PM