Kumaram Bhim Asifabad: అటవీశాఖ అసమర్ధత వల్లే పులి దాడులు
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:39 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అధికారు అసమర్ధత వల్లే పులి దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాల్వా యి హరీష్‌బాబు అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు.
-ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
కాగజ్‌నగర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ అధికారు అసమర్ధత వల్లే పులి దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాల్వా యి హరీష్‌బాబు అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. ఫారెస్టు అధికారుల దృష్టి ఎంతసేపూ అక్రమ సంపాదన మీదనే తప్ప పులుల సంరక్షణ మీద లేదన్నారు. పులిదాడిలో మనుషులు చని పోవటం ముమ్మాటికి అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. గన్నారం గ్రామానికి చెంది న లక్ష్మి మృతిచెందటం దురదృష్టకరమన్నారు. పులులకు రేడియో కాలరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే వాటిని ట్రాక్ చేయటం సులభమవుతుందన్నారు. మహారాష్ట్ర విధానాన్ని అనుసరించాలని సూచించారు. రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈవిషయాన్ని ప్రస్తావిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధానకార్యదర్శి దోనిశ్రీశైలం, ఈర్లవిశ్వేశ్వర్‌రావు, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయా, పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే..
నాలుగురోజులక్రితం పులిదాడిలో మృతిచెందిన గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబసభ్యులను సోమవారం ఎమ్మెల్యే హరీష్‌బాబు పరామర్శించారు. ఈసందర్భంగా దాడిజరిగిన తీరును తెలు సుకున్నారు. లక్ష్మి కుటుంబసభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఆయన వెంట మాజీసర్పంచి దోతుల శ్రీనివాస్, శేఖర్, రవీందర్ తదితరులున్నారు.