Hydraa: హైడ్రాకు 169 మంది సిబ్బంది కేటాయింపు
ABN , Publish Date - Sep 25 , 2024 | 07:10 PM
జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. ఇందులో సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు.
మూసీవైపు బుల్డోజర్లు..
హైడ్రా (Hydra) బుల్డోజర్లు (Bulldozers) మూసీ (Musi) వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై (Demolition) హైడ్రా ఫోకస్ పెట్టింది. శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ (Target) నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. కాగా మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.