Home » AV Ranganath
నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.
హైడ్రా పేరుతో ఎవరు సెటిల్మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు.
హైడ్రా పేరుతో ఇక సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.
హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కేసులకు సంభందించి విచారణను నాంపల్లి 9వ చీఫ్ డిస్ర్టిక్ట్ మెజిస్ర్టేట్ కోర్డులో జరపనున్నారు.
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
అనుమతులు లేని హోర్డింగ్లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలన్నింటితో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. బుధవారం మూసీ నది వెంట జరిగిన కూల్చివేతలు హైడ్రా చేపట్టినట్టు దుష్ప్రచారం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చెరువుల్లో ఎవరై నా మట్టి పోస్తే ఆ సమాచారం హైడ్రా(HYDRA)కు తెలపాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 90001 13667ను కేటాయించారు.