Share News

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌కు ప్రశ్నలు.. కీలకంగా ఏసీపీ రమేష్ కుమార్..

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:50 PM

మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అల్లు అర్జున్ లాయర్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ విచారణలో అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 2.47 గంటల వరకు విచారించారు.

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌కు ప్రశ్నలు.. కీలకంగా ఏసీపీ రమేష్ కుమార్..
Allu Arjun and ACP Ramesh Kumar

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అల్లు అర్జున్ లాయర్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ విచారణలో అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 2.47 గంటల వరకు విచారించారు. ఈ విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ (ACP Ramesh Kumar) కీలకంగా వ్యవహరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగినపుడు రమేష్ కుమార్ కుమార్ అక్కడే ఉన్నారు.


చిక్కడపల్లి డివిజన్‌కు సంబంధించి ఎల్ రమేష్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ రమేష్ కుమార్ పరిధిలోకి వస్తాయి. ఘటన జరిగిన సమయంలో స్పాట్‌లోనే ఉండడంతో రమేష్ కుమార్ ఈ విచారణలో కీలకంగా మారారు. అసలు ఈ రోజు థియేటర్‌లో ఏం జరిగిందో ఆదివారం ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు. ఘటన జరిగిన రోజు తామంతా సంధ్య థియేటర్ దగ్గరే ఉన్నామని, రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పడానికి వెళితే అతడి మేనేజర్ అడ్డుకున్నాడని తెలిపారు.


డీసీపీ ఆదేశాల మేరకు తాను అల్లు అర్జున్ దగ్గరకు కష్టపడి చేరుకుని విషయం చెప్పానని, ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశానని, అయితే సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ తనకు చెప్పారని ప్రెస్‌మీట్‌లో రమేష్ వెల్లడించారు. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ సందర్భంగా అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సేకరించిన వీడియోలు, సిసి ఫుటేజ్‌ను ముందు పెట్టి అల్లు అర్జున్‌ను విచారించినట్టు తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీసులు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2024 | 03:50 PM