Home » Allu Arjun
పుష్ప-2 చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమాకు వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు పెద్ద ఊరట లభించింది.
Allu Arjun: హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినాహాయించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు.
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి రానున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంటూ ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ఆయనకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించే విషయమై పునరాలోచించాలని హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసిచ్చారు. ఆయన రాకతో ఆస్పత్రి కార్యకలాపాలకు, ఇతర రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తెలంగాణ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీ తేజ్ పరామర్శించేందుకు రావొద్దంటూ ఆయనకు నోటీసులు అందించారు.