Amith Shah: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది
ABN , Publish Date - May 05 , 2024 | 06:33 PM
తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ జెండా విజయ కేతనం ఎగుర వేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.
ఆదిలాబాద్, మే 10: తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ జెండా విజయ కేతనం ఎగుర వేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.
Digvijaya Singh: హిందూ - ముస్లిం వివాదంపైనే ‘మోదీ రాజకీయం’
తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నిధులను.. కాంగ్రెస్ పార్టీకి మళ్లిస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిర్యాల-ఉట్నూర్ రైల్వే లైన్ నిర్మిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అమిత్ షా హామీ ఇచ్చారు.
Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్
మరోవైపు దేశంలో ముచ్చటగా మూడో సారి మోదీ ప్రభుత్వం కొలువు తీరబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు తొలగించి.. వాటిని ముస్లింలకు కట్టబెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదంటూ ఆయన విమర్శించారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
అయితే బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించారు. ప్రధాని మోదీపై ఎలాంటి అవినీతి మరకలు లేవని అమిత్ షా ఈ సందర్బంగా గుర్తు చేశారు. పేదల కోసం పని చేసే మోదీ కావాలో... రాహుల్ బాబా కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలకు అమిత్ షా సూచించారు.
Third Phase polling: మూడో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు
ఓవైసీ ఓటు బ్యాంకు, రాహుల్ ఓటు బ్యాంకు ఒకటేనన్నారు. మోదీ పాలనలో ఉగ్ర దాడులు లేవని తెలిపారు. కశ్మీర్‌లో తిరంగా జెండా ఎగిరినా.. సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను అంతం చేసిన.. ఆ ఘనత మాత్రం ప్రధాని మోదీదేనని అమిత్ షా వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ప్రచారం చేస్తుందన్నారు. వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు అమిత్ షా సూచించారు.
Read National News and Telugu News