అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని.. వృద్ధ దంపతుల ఆత్మహత్య
ABN , Publish Date - Oct 14 , 2024 | 05:15 AM
అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు ఎవరికీ భారం కాకూడదని భావించి గడ్డి మందు తాగి తనువులు చాలించారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఘటన
ఎర్రుపాలెం, అక్టోబరు 13: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు ఎవరికీ భారం కాకూడదని భావించి గడ్డి మందు తాగి తనువులు చాలించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లకు చెందిన మండల కాంగ్రెస్ సీనియర్ నేత ధనేకుల సాంబశివరావు (72), భార్య సరోజిని (65) కొన్నేళ్ల క్రితం ఎర్రుపాలేనికి వచ్చి స్థిరపడ్డారు. కుమారుడు లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు వివాహమైంది. సాంబశివరావు భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. కొద్దికాలం క్రితం సాంబశివరావు ఆసుపత్రిలో చేరగా.. బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. కుమారుడు, కుమార్తె దూరంగా ఉండడం, తమ ఆలనా పాలనా చూసే వారు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన సాంబశివరావు, సరోజిని శనివారం రాత్రి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.