Share News

Live Updates: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా..

ABN , First Publish Date - Sep 24 , 2024 | 06:58 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా..

Live News & Update

  • 2024-09-24T18:37:19+05:30

    రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా..

    వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ్య చైర్మన్ ఆమోదం తెలిపారు.

  • 2024-09-24T18:19:06+05:30

    సికింద్రాబాద్‌లో కుప్పకూలిన ఓల్డ్ జైలు భవనం..

    • సికింద్రాబాద్‌లో కుప్పకూలిన ఓల్డ్ జైలు భవనం.

    • తప్పిన ప్రమాదం.

    • ఇటీవల భారీ వర్షాలకు పూర్తిగా నానిపోయిన పురాతన భవనం.

    • రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి సిబ్బంది.

    • దుకాణ యజమానులకు, స్థానికులకు ప్రాణనష్టం కలగకుండా అక్కడ ఉన్న వారిని దూరంగా పంపిస్తున్న సిబ్బంది.

  • 2024-09-24T16:27:29+05:30

    కేటీఆర్‌కు షాక్.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్...

    అమృత్ టెండర్ల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ నేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సృజన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమృత్ టెండర్లపై కేటీఆర్‌కు సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్‌ను కలిసి అన్ని వివరాలు చెబుతానని అన్నారు. సృజన్ రెడ్డి సీఎం బావమరిది కాదని.. తన సొంత అల్లుడు అని చెప్పారు ఉపేందర్ రెడ్డి.

  • 2024-09-24T15:59:58+05:30

    ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మద్ధతుగా కేంద్ర మంత్రి..

    • ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

    • ఏపీలో టీటీడీతో పాటు ఇతర ఆలయాలు, స్వామి వారి బంగారు ఆభరణాల అంశాలు, హిందు సాంప్రదాయాలపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్దిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పందించిన బండి సంజయ్.

    • సనతాన ధర్మాన్ని కాపాడాలనుకునే వారు పవన్ కల్యాణ్‌కు మద్ధతుగా నిలవాలని పిలుపు.

  • 2024-09-24T15:37:56+05:30

    Big Alert: మరికాసేపట్లో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షం..

    హైదరాబాద్, సెప్టెంబర్ 24: వాతావరణ కేంద్రం అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటన జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • 2024-09-24T14:49:19+05:30

    Big Breaking: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కి షాక్..

    • నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ.

    • వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశం.

    • మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరు.

    • రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు.

    • నిందితుల గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు.

    • నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.

    • అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ కోర్టు ఆదేశం.

  • 2024-09-24T13:48:59+05:30

    • ఉద్వాసన

    • ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మీకి ఉద్వాసన

    • పదవి కాలం ఆగస్టులో ముగియడంతో వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు

    • సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

    • చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన గజ్జెల లక్ష్మి

    • లక్ష్మీకి నిన్న నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం

    • చైర్మన్‌కు ఉద్వాసన పలకడంతో సభ్యుల పదవీకాలం పూర్తయినట్టేనని చెబుతున్న ప్రభుత్వ వర్గాలు

  • 2024-09-24T13:34:29+05:30

    నామినేటెడ్ పదవుల లిస్ట్ ఇదే

    • వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్

    • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP): అనిమిని రవినాయుడు

    • AP హౌసింగ్ బోర్డ్: బత్తుల తాత్యబాబు

    • AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR): బొరగం శ్రీనివాసులు

    • AP మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య

    • APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ (SEEDAP): దీపక్ రెడ్డి

    • 20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ)

    • AP మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు

    • AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి

    • ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC : మంతెన రామరాజు

    • AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య

    • AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ

    • APSRTC చైర్మన్, APSRTC వైస్ చైర్మన్: కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

    • AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ

    • లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు

    • AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత

    • A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC): తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్‌ సుధీర్‌ ( జనసేన)

    • ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC): వజ్జా బాబురావు

    • AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO: వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)


  • 2024-09-24T12:47:36+05:30

    కార్యకర్తలకు పదవులు

    • అమరావతి: కార్యకర్తలకు పెద్దపీట

    • 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం

    • బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట

    • 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు

    • ఒక క్లస్టర్ ఇంఛార్జీకి ఛైర్మన్ పదవి

    • ఆరుగురు యూనిట్ ఇంఛార్జీలకు పదవులు

    • 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్,

    • వివిధ కార్పొరేషన్లకు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

    • ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం.

    • పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు

  • 2024-09-24T09:36:35+05:30

    • దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్

    • విజయవాడ: దుర్గగుడికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • స్వాగతం పలికిన దేవదాయ శాఖ కమిషనర్, ఈవో

    • ఆలయ మెట్లను శుద్ది చేసే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

    • అనంతరం మెట్ల పూజ చేసిన పవన్ కల్యాణ్

    • పాల్గొన్న ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్

      pawan.jpg

  • 2024-09-24T08:27:45+05:30

    కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో ఐటీ అధికారుల సోదాలు

    • బీఆర్‌కే ఛానల్ అధినేత బొల్ల రామకృష్ణ చౌదరి ఇంట్లో ఉదయం 5:30 నుంచి కొనసాగుతున్న ఐటీ సోదాలు

    • సోదాల్లో దాదాపు 8 మంది ఐటీ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం

    • ‘సీఎం పెళ్లాం’ సినిమా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన బొల్లా రామకృష్ణ చౌదరి

  • 2024-09-24T08:25:00+05:30

    కీలక భేటీకి కేటీఆర్ పిలుపు

    • శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు

    • ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశం

    • అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్

    • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్

  • 2024-09-24T08:22:36+05:30

    chandrababu-ap-cabinet.jpg

    మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు

    • ఇవాళ కీలక శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • టెక్నాలజీ అండ్ వర్చువల్ గవర్నెన్స్‌పై అధికారులతో చర్చ

    • అనంతరం మధ్యాహ్నం ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

    • పాలనలో సాంకేతిక వినియోగంపై రివ్యూ

    • ఆర్టీజీఎస్ వ్యవస్థ బలోపేతంపై చర్చ

    • ఆర్టీజీఎస్ వ్టవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం

    • జిల్లాల వారీగా ఆర్టీజీఎస్ సెంటర్ల ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

    • ఉన్నత విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష

    • విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అంశంపై చర్చ

  • 2024-09-24T08:20:26+05:30

    విశాఖపట్నంలో నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

    • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇదే తొలి సమావేశం

    • వైసీపీ హయాంలో చేసిన తీర్మానాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం

    • ఇటీవల చాలామంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిక

    • గత నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్

    • 10కి పది స్థానాలను గెలుచుకున్న కూటమి అభ్యర్థులు

  • 2024-09-24T07:58:59+05:30

    సత్తెనపల్లిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి

    • నిమజ్జనం సమయంలో కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

    • తిరుపతి రావు అనే యువకుడిని కాపాడిన స్నేహితులు

    • రఫీ అనే మరో యువకుడు గల్లంతు

    • అమరావతి బ్రాంచ్ కెనాల్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయని రూరల్ పోలీసులు

    • కాలువలో గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు

  • 2024-09-24T07:57:22+05:30

    • కాసేపట్లో ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం

    • పాల్గొననున్న వన్ కల్యాణ్

  • 2024-09-24T07:26:00+05:30

    pawan6.jpg

    మెట్ల మార్గాన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్

    • అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లనున్న పవన్

    • 2న శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

    • 3న తిరుపతిలో వారాహి సభ

    • తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిపై పవన్ కల్యాణ్ ఆవేదన

    • 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన డిప్యూటీ సీఎం

    • తిరుమల కొండపై దీక్ష విరమణ

  • 2024-09-24T07:01:17+05:30

    1LADDU-(2).jpg

    భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

    • టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

    • తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చెయ్యకూడదని నోటీసు.. ఉల్లంఘించడంతో కేసు నమోదు

    • అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు

    • సేక్షన్ 189(2)196 223 ఆర్/డబ్ల్యూ (3)299ఆర్/డబ్ల్యూ62 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసిన పోలిసులు

  • 2024-09-24T06:58:09+05:30

    • లైంగిక వేధింపుల కేసులో 5 రోజుల కస్టడీ కోరిన నార్సింగ్ పోలీసులు

    • విచారణను ఇవాళ్టికి (మంగళవారం) వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు

    • పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

    • బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిన జానీ మాస్టర్

    • బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎల్లుండికి వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు