Share News

BRS: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:43 AM

ఏంటో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా వికెట్లను కోల్పోతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కోల్పోయి పరిస్థితి దారుణంగా మారింది. ఇది చాలదన్నట్టు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

BRS: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!

హైదరాబాద్: ఏంటో బీఆర్ఎస్ (BRS) పార్టీ దారుణంగా వికెట్లను కోల్పోతోంది..! ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కోల్పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది..! ఇది చాలదన్నట్టు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్ క్లియర్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపేశారు. చూడబోతే పరిస్థితి ఎమ్మెల్యేతో ఆగేలా లేదు. వరుస చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అంచుకు చేరుకోవడంతో నేతలంతా వలస బాట పడుతున్నారు.


Saritha-And-Krishna-Reddy.jpg

ఏం జరుగుతుందో..?

గద్వాల ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతానంటూ అనుచరుల భేటీలో వెల్లడించారు. తాజాగా రేవంత్ రెడ్డితో గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరి కొంత మంది లోకల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత అనుచరులు సెల్ టవర్ ఎక్కి పెట్రోల్ పోసుకుంటామంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. సరిత, తిరుపత్యలకు రేవంత్ నచ్చచెబుతున్నట్టుగా తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినా పార్టీలో సరితకు సముచిత స్థానం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2024 | 11:12 AM