Group 1: గ్రూప్ 1 ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
ABN , Publish Date - Mar 14 , 2024 | 02:29 PM
తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 రీ నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 రీ నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా ఇప్పటివరకు 2.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 563 పోస్టులకి ఇప్పటికి రెండు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖస్తూ చేసుకున్నారు. కాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను గతేడాది రెండు సార్లు నిర్వహించారు. కానీ పలు కారణాలతో రెండు సార్లు పరీక్ష రద్దైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.