Home » Group-1
గ్రూప్-1 ఫలితాలపై వచ్చిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. కోఠి కాలేజీలో 25 శాతం మంది మహిళలు మెయిన్స్ రాసారని, ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో ఒక్కరికే పిలుపు వచ్చిందని వివరించింది.
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం కలిగించేలా రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించిన జీవో 29ను రాష్ట్రప్రభుత్వం రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలకు మార్గం సుగమం అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
గ్రూప్-1లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన టీజీఆర్టీసీ ఉద్యోగుల పిల్లలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు.
Group 1 candidates: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరపాలంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని.. మూల్యాంకనంలో పెద్దఎత్తున లోపాలున్నాయని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు.
గ్రూప్-1 ఫలితాలలో అవకతవకలు జరిగాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.