Share News

Teacher: కొత్త టీచర్లకు నియామక పత్రాలు

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:55 AM

ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పత్రాలను ఇస్తారు.

Teacher: కొత్త టీచర్లకు నియామక పత్రాలు

  • సీఎం చేతుల మీదుగా నేడు ఎల్బీ స్టేడియంలో

  • అభ్యర్థులను రప్పించేందుకు ఉచిత బస్సులు

  • మొత్తం 11,062 పోస్టులు.. 10,006 భర్తీ

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పత్రాలను ఇస్తారు. రాష్ట్రంలో మొత్తం 11,062 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం 10,006 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 1,056 పోస్టులను పెండింగ్‌లో ఉంచారు. వీటి భర్తీపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సమాచారాన్ని అందజేశారు.


వారిని బుధవారం ఉదయం నుంచే ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి ప్రత్యేక ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఉదయం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంటే.. అక్కడి నుంచి బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి తీసుకువస్తారు. ఎల్బీ స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు తమ జిల్లా కౌంటర్‌లోనే నియామక పత్రాలను తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఉపాధ్యాయుల నియామకాల వివరాలు..

పోస్టు పేరు మొత్తం ప్రస్తుతం

పోస్టులు భర్తీ ఖాళీ

స్కూల్‌ అసిస్టెంట్లు 2,629 2,515 114

లాంగ్వేజ్‌ పండిట్లు 727 685 42

పీఈటీలు 182 145 37

ఎస్‌జీటీలు 6,508 6,277 231

ఎస్‌.ఏ 220 103 117

(స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌)

ఎస్‌జీటీ 796 281 515

(స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌)

మొత్తం 11,062 10,006 1,056

Updated Date - Oct 09 , 2024 | 03:55 AM