పీవోడబ్ల్యూ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా అనసూయ, మంగ నియామకం
ABN , Publish Date - Sep 04 , 2024 | 06:28 AM
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నూతన కమిటీని రాష్ట్ర ఏడవ మహాసభలో ఎన్నుకున్నట్లు సంఘం జాతీయ నాయకురాలు ఝాన్సీ మంగళవారం విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
రాంనగర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) నూతన కమిటీని రాష్ట్ర ఏడవ మహాసభలో ఎన్నుకున్నట్లు సంఘం జాతీయ నాయకురాలు ఝాన్సీ మంగళవారం విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా పి. అనసూయ, ప్రధాన కార్యదర్శిగా అందే మంగ, ఉపాధ్యక్షురాలిగా ఎన్. జ్యోతి, సరిత, కె. జ్యోతి, కార్యదర్శులుగా ఆర్.గీత, హరిత, కోశాధికారిగా వై. జానకితో పాటు 16 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుందన్నారు. ఈసందర్భంగా అనసూయ, మంగ మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్ నిర్మూలన, మహిళా చట్టాలు సక్రమంగా అమలు, మహిళలకు 50% రిజర్వేషన్ల అమలు, మహిళలపై గృహహింస, ఫాసిస్టు, మనువాదంకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు.