Share News

Gandhi: అది కాంగ్రెస్‌ కండువా కాదు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:13 AM

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాకు కప్పింది కాంగ్రెస్‌ కండువా కాదు. ఆలయానికి సంబంధించిన శాలువా’’

Gandhi: అది కాంగ్రెస్‌ కండువా కాదు..

  • సీఎం కప్పింది ఆలయ శాలువా: అరికెపూడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాకు కప్పింది కాంగ్రెస్‌ కండువా కాదు. ఆలయానికి సంబంధించిన శాలువా’’ ..శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి! కానీ.. సీఎం రేవంత్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు జూలై 13న తెలంగాణ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేసింది! గాంధీతోపాటు కార్పొరేటర్లు నాగేందర్‌యాదవ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌, మంజుల రఘునాథ్‌రెడ్డి, నార్నె నివాస్‌ తదితరులూ సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు అందులో స్పష్టంగా పేర్కొంది! అరికెపూడి గాంధీకి రేవంత్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న ఫొటోనూ పోస్ట్‌ చేసింది. గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ట్వీట్‌ను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 04:13 AM