TG Assembly: ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు
ABN , Publish Date - Jul 31 , 2024 | 08:21 AM
నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరుగనుంది.
హైదరాబాద్: నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేడు కూడా ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరుగనుంది. నేడు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు సభ ముందుకు దవ్య వినిమయ బిల్లు రానుంది. చర్చ అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలు పెట్టనున్నారు. కాగా.. నిన్న తెలంగాణ అసెంబ్లీ రికార్డులు బద్దలు కొట్టింది. ఒకే రోజు 17 గంటల 20 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే క్రమంలో.. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. 19 పద్దులపై చర్చ జరిగింది.
అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. వాయిదాలు, వాకౌట్‌లు, నిరసనలు లేకుండా సభ నిరవధికంగా జరిగింది. సోమవారం ఉదయం మొదలైన సభ.. మంగళవారం తెల్లవారు జామున 3.20 గంటల వరకూ కొనసాగింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా 12 గంటల పాటు సభ జరిగింది. ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ నిన్న ఏకంగా 17 గంటల పైన సభ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్న కూడా శాసన సభలో ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరగనుంది. దీనిని మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు కూడా 19 పద్దులపై చర్చలు జరగనున్నాయి. మత్స్య శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసన సభలో చర్చ జరగనుంది.
ఇంకా వ్యవసాయ శాఖ, టూరిజం శాఖల పద్దులపై కూడా నేడు శాసనసభ చర్చించనుంది. దేవాదాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పద్దులతో పాటు రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, మాతా శిశు సంక్షేమ పద్దులపై సభలో చర్చ జరుగనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐ అండ్ పీఆర్‌లపై సభ్యులు చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఇరిగేషన్, సివిల్ సప్లై పద్దులపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ వేదికగా రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగనుంది. ఒకటిన్నర లక్షల రుణాల వరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు రూ. 6,100 కోట్ల లబ్ది చేకూరనుంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.
వలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్ కల్యాణ్‌కు ఊరట
Read more Telangana News and Telugu News