Share News

TG Assembly: ఆరవ రోజు అసెంబ్లీ.. నేడు 9 శాఖల పద్దులపై చర్చ

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:08 AM

నేడు ఆరవ రోజు తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. నిన్నంతా సభ చాలా వాడీవేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నిన్న సభ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికారపక్షంగా సాగింది.

TG Assembly: ఆరవ రోజు అసెంబ్లీ.. నేడు 9 శాఖల పద్దులపై చర్చ

హైదరాబాద్: నేడు ఆరవ రోజు తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. నిన్నంతా సభ చాలా వాడీవేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నిన్న సభ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికారపక్షంగా సాగింది. ఇక ఇవాళ కూడా శాసన సభలో ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరుగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసన సభ సాగింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రానుంది. సభలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు సభలో పద్దులపై చర్చించనున్నారు. తొమ్మిది శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. మత్స్య శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ పద్దులపై నేడు చర్చించనుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసన సభలో చర్చ జరగనుంది.


వ్యవసాయ శాఖ, టూరిజం శాఖల పద్దులపై శాసనసభ చర్చించనుంది. దేవాదాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పద్దులపై శాసన సభలో సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మాతా శిశు సంక్షేమ పద్దులపై సభలో చర్చ జరుగనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐఅండ్ పీఆర్‌లపై సభ్యులు చర్చించనున్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లైపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగనుంది. ఒకటిన్నర లక్షల రుణాల వరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు 6100 కోట్ల లబ్ది చేకూరనుంది. మధ్యాహ్నం 1 గంటలకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.


తెలంగాణ శాసన సభలో బీఆర్ఎస్ ఇచ్చిన కట్ మోషన్స్‌పై నిన్న శాసనసభలో పెద్ద ఎత్తున రగడ జరిగింది. కట్ మోషన్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. కట్ మోషన్స్‌ను టేకప్ చెయ్యకుండా పద్దులకు ఆమోదం తెలుపాలని ప్రభుత్వం కోరింది. గతంలో కట్ మోషన్స్ టేకప్ చెయ్యకుండా బుల్డోజర్ చేసి పద్దులకి ఆమోదం తెలిపారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాం కాబట్టి అన్నింటికీ సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షం మాకు సహకారం ఇవ్వాలని శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై నిన్న వాడి వేడిగా చర్చ ముగిసింది. ఆయా సభ్యులు లెవనెత్తిన అంశాలపై సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు.

Krishna River: సాగర్‌ దిశగా కృష్ణమ్మ..

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 30 , 2024 | 08:08 AM