Share News

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:49 AM

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Ayodhya Ram Mandir: 22న ప్రసవం అయ్యేలా చూడండి.. వైద్యులను కోరుతున్న జంటలు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నెలలు నిండి ప్రసవానికి దగ్గరగా ఉన్నా గర్భిణులు తమకు సోమవారం ప్రసవం జరిగే అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా వైద్యులను కోరుతున్నారు. గ్రేటర్‌లోని పలు ఆస్పత్రులకు ఇలాంటి వినతులు వస్తున్నట్లు తెలిసింది. నెలలు నిండిన తన భార్యకు సరిగ్గా అదే ముహూర్తంలో ప్రసవం చేయాలని ఓ జంట సికింద్రాబాద్‌(Secunderabad)లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి వైద్యులను కోరారు. ఈ మేరకు షాద్‌నగర్‌కు చెందిన ఆ జంట ఇప్పటికే అడ్మిషన్‌ కూడా తీసుకున్నారని గైనకాలజిస్టు డాక్టర్‌ నిర్మల తెలిపారు. ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడడం, ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకే ప్రసవం అయ్యేలా చూడాలని వైద్యులను కోరినట్లు చెప్పారు. మరొకరు కూడా అడిగినా, ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడంతో రెండు రోజులు ముందుగానే ప్రసవం చేయాల్సి వచ్చిందని డాక్టర్‌ నిర్మల చెప్పారు.

city2.jpg

Updated Date - Jan 21 , 2024 | 11:49 AM