Share News

Bandi Sanjay: విద్యార్థులకు పురుగులన్నం పెట్టడమే విజయోత్సవమా?

ABN , Publish Date - Dec 05 , 2024 | 04:17 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నవి విజయోత్సవాలు కావని, వికృత ఉత్సవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: విద్యార్థులకు పురుగులన్నం పెట్టడమే విజయోత్సవమా?

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నవి విజయోత్సవాలు కావని, వికృత ఉత్సవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ దృష్టిలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడమే విజయమని, వారి చావులే ఉత్సవాలని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఆడబిడ్డలను ఆగం చేయడం, రైతలుకు రుణమాఫీ చేస్తామని మాట తప్పడమే కాంగ్రెస్‌ విజయాలుగా భావిస్తోందని ఎద్దేవా చేశారు. ఏడాది అరాచక పాలనలో ప్రజల చావులు, గోసలే ఆ పార్టీ దృష్టిలో ఉత్సవాలని ఆయన విమర్శించారు.

Updated Date - Dec 05 , 2024 | 04:17 AM