Share News

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్.. బండికి కీలక బాధ్యతలు..!

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:40 PM

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌కు కీలక బాధ్యతలను హై కమాండ్ అప్పగించింది. కిసాన్ మోర్చా ఇంచార్జీ బాధ్యతలను కట్టబెట్టింది. బీజేపీలో కీలకమైన వింగ్‌కు ఇకపై బండి సంజయ్ నేతృత్వం వహిస్తారు.

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్.. బండికి కీలక బాధ్యతలు..!

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో న్యాయ’ అనే మరో యాత్రకు సిద్ధం అవుతున్నారు. తామేం తక్కువ కాదని అంటోంది అధికార భారతీయ జనతా పార్టీ. పార్టీ అంతర్గత కమిటీలను ప్రక్షాళన చేసింది. పలువురికి కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌‌‌కు (Bandi Sanjay) పెద్ద బాధ్యతను అప్పగించింది.

సీట్లు మాత్రం తగ్గొద్దు

గత వారం బీజేపీ ఆఫీస్ బేరర్లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వచ్చే ఎన్నికల కోసం చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించారు. బీజేపీలో వివిధ మోర్చాలకు కొత్త వారిని నియమించారు. కొత్త వారు వెంటనే బాధ్యతలు చేపడుతారని ప్రకటించారు. ప్రధాని మోదీ (PM Modi) ఆదేశాలతో ఆ సమావేశం జరిగిందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య ఏమాత్రం తగ్గొద్దని మోడీ దిశానిర్దేశం చేశారని.. అందుకే వెంటనే మోర్చా అధిపతులను మార్చారని సమాచారం.

బండి భుజనా కీలక బాధ్యత

తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌కు (Bandi Sanjay) కీలక బాధ్యతలను హై కమాండ్ అప్పగించింది. కిసాన్ మోర్చా ఇంచార్జీ బాధ్యతలను కట్టబెట్టింది. బీజేపీలో కీలకమైన వింగ్‌కు ఇకపై బండి సంజయ్ నేతృత్వం వహిస్తారు. తెలంగాణలో బీజేపీ ఊపు రావడానికి ఆయనే కారణం. అందుకే కీలక బాధ్యతలు ఇచ్చింది. సునీల్ బన్సాల్‌కు (Sunil Bansal) యువ మోర్చా ఇంచార్జీగా నియమించింది. బైజయంత్ జే పాండాకు మహిళా మోర్చా బాధ్యతలు, తరుణ్ చుగ్‌కు ఎస్సీ మోర్చా బాధ్యతలు, రాధా మోహన్ దాస్ అగర్వాల్‌కు ఎస్టీ మోర్చా, వినోద్ తావ్డేకు ఓబీసీ మోర్చా, దుష్వంత్ కుమార్ గౌతమ్‌కు మైనార్టీ మోర్చా బాధ్యతలను కట్టబెట్టింది.

ఓటు బ్యాంక్ పెంచడమే లక్ష్యం..?

వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ మోర్చా పదవులను కీలక నేతలకు అప్పగించింది. ఆ వింగ్స్ పటిష్టం చేసే బాధ్యత వీరిపై ఉంది. ఎటొచ్చి బీజేపీ ఓటు బ్యాంక్ పెంచడమే వీరి లక్ష్యంగా నిర్దేశించారు. హైకమాండ్ ఆదేశాలతో ఆ పనిలో నేతలు నిమగ్నం అయ్యారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2024 | 01:55 PM