Share News

Bhatti Vikramarka: ‘డ్రగ్స్‌’పై కలిసికట్టుగా పోరాడాలి

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:05 AM

ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ మహమ్మారి ఇప్పుడు గ్రామస్థాయి వరకు పాకిందని.. అందువల్ల ప్రజలంతా కలిసికట్టుగా పోరాడితే మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka:  ‘డ్రగ్స్‌’పై కలిసికట్టుగా పోరాడాలి

  • ప్రపంచ డ్రగ్స్‌ వ్యతిరేక దినోత్సవంలో భట్టి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ మహమ్మారి ఇప్పుడు గ్రామస్థాయి వరకు పాకిందని.. అందువల్ల ప్రజలంతా కలిసికట్టుగా పోరాడితే మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టం కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం ఎంత బడ్జెట్‌ అయినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

మాదక ద్రవ్యాల ముఠాల వెనుక ఎంత పెద్దవారున్నా కఠినంగా వ్యవహరించాలని నార్కోటిక్‌ బ్యూరో అధికారులను ఆదేశించారు. జూన్‌ 26న ప్రపంచ డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో విభాగం ఆధ్వర్యంలో నెక్లె్‌సరోడ్‌లోని జలవిహార్‌లో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ మహమ్మారికి వ్యతిరేకంగా భాస్కర్‌ రచించిన.. సంజనా సౌమ్య పాడిన ‘రామసక్కని కొడుకా’ గీతాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అనంతరం వందలాది మంది విద్యార్థులు, యువత చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. స్కూల్‌, కాలేజీ, యూనివర్సిటీలతో పాటు.. గ్రామ స్థాయి వరకు యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 26 , 2024 | 07:47 AM