Home » Congress Govt
రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు.
ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.
రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి మరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు.
Hydra: అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆ ఇళ్లను కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని.. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని కవిత ప్రశ్నించారు.