Share News

Bithiri sathi: భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కైన బిత్తిరి సత్తి

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:35 PM

చేవెళ్ల రవి గురించి ఎవరికైనా తెలుసా? బిత్తిరి సత్తి.. అలియాస్ ఇస్మార్ట్ సత్తి.. తుపాకి రాముడు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు చేవెళ్ల రవి. అతని బిత్తిరి మాటలు, చేతలు జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో బిత్తిరి సత్తిగా స్థిరపడిపోయాడు

Bithiri sathi: భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కైన బిత్తిరి సత్తి

హైదరాబాద్: చేవెళ్ల రవి గురించి ఎవరికైనా తెలుసా? బిత్తిరి సత్తి.. అలియాస్ ఇస్మార్ట్ సత్తి.. తుపాకి రాముడు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. అంతలా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు చేవెళ్ల రవి. అతని బిత్తిరి మాటలు, చేతలు జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో బిత్తిరి సత్తిగా స్థిరపడిపోయాడు. అయితే ఏది చేసినా ఇక చెల్లుతుందనుకున్నాడో ఏమో కానీ తాజాగా భగవద్డీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కయ్యాడు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి స్కిట్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు హిందూ సంఘాలు సైతం బిత్తిరి సత్తిపై మండి పడుతున్నాయి. వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ సర్వత్రా బిత్తిరి సత్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

satti--1.jpg


వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తన వీడియోలు హిందువులను కించపరిచేలా లేవని బిత్తిరి సత్తి సమర్ధించుకున్నారు. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకి వానర సేన అనే హిందూ సంఘం ఫిర్యాదు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. బుల్లితెరపై బిత్తిరి సత్తి తన వీడియోలతో ఓ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయితే ఒక స్థాయికి చేరుకున్నాక మాత్రం ఎందుకో ఆ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. ఆయనపై ఎన్నో విమర్శలు.. మరెన్నో ఆరోపణలు వచ్చాయి. ఇమేజ్‌ను మొత్తం డ్యామేజ్ చేసుకునేలా పుల వీడియోలు చేశాడు.

satti--2.jpg


వాటిలో భగవద్గీతపై చేసిన వీడియో ఒకటి. వాస్తవానికి హిందువులు అత్యంత పవిత్రంగా భగవద్గీతను చూస్తారు. అలాంటి భగవద్గీతపై వీడియో చేస్తే ఎంత జాగ్రత్తగా చేయాలి? మొత్తానికి తనదైన శైలిలో చేసుకుంటూ పోయాడు. పైగా భగవద్గీతను బిల్లు గీత అని పేరు పెట్టాడు. దీంతో రాష్ట్రీయ వానరసేన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వీడియోను తొలగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిని బిత్తిరి సత్తి సమర్థించుకోవడం మరింత వారికి ఆగ్రహం తెప్పించింది. తాను కూడా ఒక హిందువేనంటూ పార్టీ పరంగా తనకు కాల్స్ చేయవద్దని రాష్ట్రీయ వానరసేన మెంబర్ కేశవ రెడ్డిపై మండిపడ్డాడు. ‘నీకు చెప్పి చేయాలా? నేను హిందువును కానా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను ఇన్‌సల్ట్ చేయవద్దని కావాలంటే కేసులు నమోదు చేసుకోవాలని చెప్పాడు. పైగా కొన్ని వేల మందికి నచ్చిందని.. మీకు నచ్చకుంటే తానేం చేయాలేనంటూ నిర్లక్ష్యంగా బిత్తిరి సత్తి సమాధానం ఇచ్చాడు.

satti--3.jpg

Updated Date - Aug 07 , 2024 | 02:08 PM