Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ను క్రిమినల్‌ను చేయకండి.. అతడిని గౌరవించండి: ఎమ్మెల్యే రాజా సింగ్
ABN , Publish Date - Dec 13 , 2024 | 02:59 PM
పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ వార్త సంచలనంగా మారింది. పుష్ప-2 (Pushpa-2) విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు (Allu Arjun Arrest).
అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని ట్వీట్ చేశారు. ``ధియేటర్ వద్ద జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ స్పష్టమైన వైఫల్యాన్ని సూచిస్తోంది. జాతీయ అవార్డును సాధించిన అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు. అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారు. సంబంధం లేని విషయంలో అతడిని బాధ్యుడిని చేయడం అన్యాయం, అసమంజసం. జనాలను నియంత్రంచడంలో లోపాలను పరిష్కరించడానికి బదులుగా, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం పరిపాలన వైఫల్యాన్ని సూచిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారిని ఈ ఘటనకు బాధ్యులను చేయాలి. అల్లు అర్జున్ సేవలను గుర్తించి, అతడికి తగిన గౌరవం ఇవ్వాలి. అతడిని నేరస్థుడిలా ట్రీట్ చేయడం మంచిది కాదు`` అంటూ రాజా సింగ్ ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ వైద్య పరీక్షలు ముగిసిన తరువాత నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..