Share News

KCR: ఆమెరికాకు మాజీ సీఎం కేసీఆర్ !

ABN , Publish Date - Dec 15 , 2024 | 02:44 PM

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ వద్దకు వెళ్లి కొన్ని రోజులు గడిపేందుకు ఆయన పయనమవుతున్నట్లు తెలుస్తుంది.

KCR: ఆమెరికాకు మాజీ సీఎం కేసీఆర్ !

హైదరాబాద్, డిసెంబర్ 15: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అమెరికా పర్యటనకు తొలిసారి వెళ్లనున్నారు. ఉద్యమ సమయంలోనే కాదు.. పదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏ రోజు ఆయన యూఎస్‌ వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో కేసీఆర్ యూఎస్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఆయన విదేశీ పర్యటనపై పార్టీ కేడర్‌లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: వేదిక కూలి కింద పడ్డా ఎమ్మెల్యేలు .. స్వల్ప గాయాలు


కానీ ఇంకా ఆయన ఎప్పుడు వెళ్లేది ఇంకా ఖరారు కాలేదని సమాచారం. అటు కేసీఆర్ బంధువులు, కేటీఆర్ ఫ్యామిలీ నుంచి కానీ కేసీఆర్ పర్యటనను ఇంకా దృవీకరించలేదు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం భారీ చర్చ జరుగుతోంది. అమెరికాలోనే ఆయన దాదాపు రెండు నెలల పాటు ఉంటారనే ప్రచారం పెద్ద పెట్టున సాగుతోంది.

Also Read:పైసల కోసం వెళ్లినోడు నాయకుడా?

Also Read: నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం


గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రజా సమస్యలపై సైతం ఆయన స్పందించిన దాఖలాలు అయితే లేవన్నది రాష్ట్ర ప్రజల ఉవాచ. అయితే ప్రజా సమస్యలపై అయితేనేమీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం అయితేనేమీ కేవలం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులే చేస్తున్నారు.

Also Read: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

Also Read: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్


మరోవైపు కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు ఓ చర్చ సైతం సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారంటూ పార్టీలో అంతర్గతంగా ఓ ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ కేసీఆర్.. యూఎస్‌కు ప్రయాణం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఆయన యూఎస్ వెళ్లితే.. రెండు నెలలు ఉంటారని తెలుస్తుంది. మరి ఆయన ఎప్పుడు వెళ్తారనేది మాత్రం ఫిక్స్ కాలేదు.

Also Read: కేసీఆర్ ఫ్యామిలీ నాటకం.. యువత బలిదానాలకు కారణం


ఇంకోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనవడితో కోన్ని రోజులు గడిపేందుకు కేసీఆర్ నిర్ణయించారని.. అందుకోసం యూఎస్‌కు ప్రయాణం కడుతున్నారని ఓ చర్చ సైతం సాగుతోంది.

ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హిమాన్ష్ విరాళాలు సేకరించి.. గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హిమాన్ష్ పై అభినందనలు వెల్లువెత్తిన విషయం విధితమే.

For TelanganaNews And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 02:44 PM