NEET: పేపర్ లీక్‌పై ఈడీ విచారణకు ఎందుకు ఆదేశించ లేదు
ABN , Publish Date - Jun 24 , 2024 | 01:10 PM
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీక్ అయిందని విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 24: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కమార్ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ లీక్ అయిందని విమర్శించారు. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినా ఈడీ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించ లేదని ఆయన మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా పీజీ ఎంట్రెన్స్ పరీక్షను కేంద్రం రద్దు చేసిందని.. అందువల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఈ మోదీ ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
నీట్‌లో తాముండమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. పేపర్ లీక్ చేస్తే ఉరిశిక్ష తరహాలో కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాలు తీసుకు రావాలని మోదీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వినోద్ కుమార్ ఆరోపించారు.
Read Latest Latest News and National News