Home » Modi 3.0 Cabinet
ప్రధాని నరేంద్ర మోదీకి 2024 కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.
ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్మెంట్లో భారీ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి చెందిన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 30 సివిల్స్ కోచింగ్ సెంటర్ల బెస్‌మెంట్‌ను సీల్ చేశామని తెలిపారు.
హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.
దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ఇకపై సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించినట్లు మోదీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తనదైనశైలిలో స్పందించింది.
భారత ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి.. వచ్చే ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.