Delhi Liquor Case: కవితకు బెయిల్ నిరాకరణ.. వైయస్ జగన్ పేరు ప్రస్తావించిన కోర్టు
ABN , Publish Date - May 06 , 2024 | 08:03 PM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి.. తన తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు.
న్యూఢిల్లీ, మే 06: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చే విషయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్షాకాలాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఫిర్యాదుదారుడికి లేదా సాక్షులకు ముప్పు కల్గించే పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు.
నిందితులు తప్పించుకుని పారిపోయే అవకాశాలను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. నిందితుల వ్యక్తిత్వం, స్వభావం, ప్రవర్తనను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర - దేశ ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు.
CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..
బెయిల్ ఇచ్చే విషయంలోనైనా, నిరాకరించే విషయంలోనైనా కేసులోని సాక్ష్యాధారాలను లోతుగా, నిశితంగా పరిశీలించాల్సిన అవసరం లేదని తెలిపారు. వాటిని కేవలం ప్రాథమిక అభిప్రాయంగా ఏర్పర్చుకోడానికి మాత్రమే పరిశీలించాలన్నారు.
Arvind kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం
ఇక కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఏపీ సీఎం వైయస్ జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను ఈ సందర్బంగా జడ్జి ప్రస్తావించారు. ఈ కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా ఈ స్థితిలో బెయిల్ ఇవ్వడం తగదని భావిస్తున్నానని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తన తీర్పులో పేర్కొన్నారు.
Read Latest National News And Telugu news