Home » Delhi liquor scam
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుంది. బీజేపీ మెజార్టీ మార్క్ దాటడానికి అసలు కారణం ఏమిటి.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.
CM Athishi: మరికొద్ది గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. సీఎం అతిషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎన్నికల సంఘంపై సీఎం అతిషి విరుచుకు పడ్డారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరితోపాటు వారి కుటుంబ సభ్యులు దాడులు చేస్తూన్నా.. ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
CM Revanth Reddy: అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరి నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీ్‌పసింగ్ ధాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు సోమవారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ‘‘నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను.
ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.