Share News

TS News: రోడ్లుపైకి బీఆర్ఎస్ శ్రేణులు.. ఇప్పుడే చేరుకున్న కేటీఆర్.. టెన్షన్ టెన్షన్!

ABN , Publish Date - Mar 15 , 2024 | 06:13 PM

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అరెస్ట్ వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చాయి. ఇప్పటికే కవిత నివాసం ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఇక కవిత అరెస్ట్ వార్తను తెలుసుకున్న గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కవిత అరెస్ట్ అక్రమమంటూ మండిపడుతున్నారు.

TS News: రోడ్లుపైకి బీఆర్ఎస్ శ్రేణులు.. ఇప్పుడే చేరుకున్న కేటీఆర్.. టెన్షన్ టెన్షన్!

హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు రోడ్లుపైకి వచ్చాయి. పెద్ద సంఖ్య బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కవిత నివాసం ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.

కవిత నివాసానికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు

కవిత అరెస్ట్ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంటనే మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. అయితే ఎవరినీ నివాసంలోకి రాకుండా ఈడీ, ఐడీ అధికారులు అడ్డుకుంటున్నారు.

భారీ భద్రతను మోహరించినప్పటికీ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కవిత నివాసానికి చేరుకుంటున్నాయి. కవిత అరెస్ట్ వార్తను తెలుసుకున్న గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కవిత అరెస్ట్ అక్రమమంటూ మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 15 , 2024 | 06:20 PM