Share News

ఖమ్మంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:48 AM

నేడు ఖమ్మంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతు భరోసా పథకం అమలుకు నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఖమ్మంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

ఖమ్మం: నేడు ఖమ్మంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతు భరోసా పథకం అమలుకు నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీతోపాటు ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు రైతులు రైతు సంఘాల నేతలతో భరోసాపై చర్చించనున్నారు.


క్యాబినెట్ సబ్ కమిటీ నేరుగా రైతులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం ముందు ఉంచనుంది. క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా పథకం అమలు విధివిధానాల పై ఖమ్మంలో తొలిసారిగా సమావేశం కానుంది. నేటి ఉదయం 10.30 గంటల నుంచి రెండు గంటల వరకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.

Updated Date - Jul 10 , 2024 | 10:49 AM