Share News

ఛత్తీస్‌గఢ్ల్ లో ఆదివాసీ మహిళలపై అకృత్యాలను అరికట్టాలి

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:25 AM

ఛత్తీస్‌గఢ్ల్ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపై కేంద్ర బలగాలు చేస్తున్న అకృత్యాలను అరికట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

ఛత్తీస్‌గఢ్ల్ లో ఆదివాసీ మహిళలపై  అకృత్యాలను అరికట్టాలి

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్‌

రాంనగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ దండకారణ్యంలో ఆదివాసీ మహిళలపై కేంద్ర బలగాలు చేస్తున్న అకృత్యాలను అరికట్టాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ‘చైతన్య మహిళా సంఘం’ రాష్ట్ర కన్వీనర్‌ జ్యోతి, కో- కన్వీనర్‌ ఆధ్వర్యంలో ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో అమలు చేస్తున్న హింసను వెంటనే ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పి ఆదివాసీల డిమాండ్లను నెరవేర్చాలని వక్తలు డిమాండ్‌ చేశారు. అలాగే నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో చెంచు మహిళపై జరిగిన హింసకు సంబంధించి సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సామాజిక వేత్త సజయ, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, సృజన, ప్రొఫెసర్‌ వనమాల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 09:45 AM