Share News

TG News: రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఈడ్చుకుంటూ వెళ్లి మరీ..

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:06 AM

రాజేంద్రనగర్‌లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. మహిళ బస్టాప్‌లో ఉండగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బుద్వేల్ ఫిల్టర్ బెడ్ వద్ద మహిళ మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు.

TG News: రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఈడ్చుకుంటూ వెళ్లి మరీ..

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. మహిళ బస్టాప్‌లో ఉండగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బుద్వేల్ ఫిల్టర్ బెడ్ వద్ద మహిళ మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. చైన్ లాగే క్రమంలో ఆమె కింద పడిన కూడా అలాగే రోడ్డు పై ఈడ్చుకుంటూ వెళ్లి దుండగులు గొలుసును అపహరించారు. క్షణాల మీద పక్కనే ఉన్న చెట్ల పొదలల్లో నుంచి పరార్ అయ్యారు. మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో నర్స్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే స్పాట్‌లో రెండు సార్లు చైన్ స్నాచింగ్ జరిగింది.

Hyderabad : ప్రభుత్వాలు మారుతున్నా దక్కని ‘క్షమాభిక్ష’!

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 11:42 AM