TS News: జగిత్యాల జిల్లాలో చిరుత పులి కలకలం...
ABN , Publish Date - Jan 24 , 2024 | 10:06 AM
ఇబ్రహీంపట్నం మండలంలో చిరుతపులి కలకలం రేపుతోంది. సత్తక్కపల్లి, ఎర్రపూర్, అమ్మక్కపేట గ్రామ శివారులో గ్రామస్థులు చిరుత సంచరిస్తునట్లు చెబుతున్నారు. వ్యవసాయ తోటలో చిరుత అడుగులను గుర్తించారు.
జగిత్యాల: ఇబ్రహీంపట్నం మండలంలో చిరుతపులి కలకలం రేపుతోంది. సత్తక్కపల్లి, ఎర్రపూర్, అమ్మక్కపేట గ్రామ శివారులో గ్రామస్థులు చిరుత సంచరిస్తునట్లు చెబుతున్నారు. వ్యవసాయ తోటలో చిరుత అడుగులను గుర్తించారు. అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. పాదాల అడుగులను అధికారులు పరిశీలించారు. పూర్తి నిఘాను అధికారులు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లొద్దని రైతులకు సూచించడం జరిగింది. పది రోజుల నుంచి మూడు గ్రామాల్లో చిరుతపులి తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.